Homeజిల్లాలుకామారెడ్డిMLA Lakshmi Kantha Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

MLA Lakshmi Kantha Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: MLA Lakshmi Kantha Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్​ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను పరామర్శించేందుకు నిజాంసాగర్​ (Nizamsagar), మహమ్మద్​నగర్ (Mahammad nagar)​ మండల కాంగ్రెస్​ నాయకులు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి, రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణపై ఆయన సమాలోచనలు చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజా పండరి, సవాయిసింగ్​, లౌకియా నాయక్, లక్ష్మయ్య, ప్రవీణ్ కుమార్, బ్రహ్మం, తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన అచ్చంపేట గ్రామ నాయకులు

ఎమ్మెల్యేను పరామర్శిస్తున్న సుల్తాన్ నగర్ గ్రామ నాయకులు

Must Read
Related News