అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar | ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ (Yele Mallikarjun) అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Government High School)లో శుక్రవారం మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
Nizamsagar | పౌరుడిగా బాధ్యత నిర్వర్తించాలి
దేశ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తిస్తూ.. మతం, కులం, వర్గం, భాష వంటి అంశాలకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలని ఏలె మల్లికార్జున్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులు తదితరులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించేలా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వసంత పంచమి (Vasant Panchami) సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మాణంలో ఉన్న టాయిలెట్స్ ఇంకా పూర్తి కాకపోవడాన్ని గమనించి సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.