అక్షరటుడే, భీమ్‌గల్ : MLA Prashanth Reddy | ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అంకితభావంతో గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. వేల్పూర్ మండలం (Velpur Mandal) జానకంపేట గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, అలాగే ఏకగ్రీవమైన వార్డు సభ్యులు సౌడ రాకేష్, ఎడ్ల ఓపెష్, తలారి గంగాధర్, వేణు తదితరులు బుధవారం వేల్పూర్‌లో ఎమ్మెల్యే (Velpur MLA)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం అనేది బాధ్యతను మరింత పెంచుతుందని, పార్టీలకతీతంగా గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు (Government Schemes) అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) నాగాధర్ రెడ్డి, సౌడ రమేష్, కొలిపాక శ్రీనివాస్, సత్యం, డైరెక్టర్ శేఖర్, శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.