ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిManala Mohan reddy | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

    Manala Mohan reddy | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Manala Mohan reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతికార్యకర్త కష్టపడి పని చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ అన్నారు. బాన్సువాడ (Banswada) పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి (Congress party Meeting) ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

    Manala Mohan reddy | ఏనుగు వర్గీయుల బైఠాయింపు

    కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి సమాచారం లేదని ఏనుగు రవీందర్ రెడ్డి (Enugu Ravinder Reddy) వర్గం కార్యకర్తలు జిల్లాల అధ్యక్షులను కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. జిల్లాల అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కైలాస్​ శ్రీనివాస్ ఏనుగు వర్గీయుల వద్దకు చేరుకొని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Pcc Chief mahesh kumar), రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (State In-charge Meenakshi Natarajan) దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఏనుగు వర్గీయులు శాంతించారు. ఈ కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ బాలరాజు, ఉమ్మడి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అబ్జర్వర్లు వేణుగోపాల్ యాదవ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...