Homeజిల్లాలుకామారెడ్డిLocal Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: మాజీ ఎమ్మెల్యే ఏనుగు...

Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మోస్రా మండలాల్లో పర్యటించారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ కార్యకర్తలు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ (Banswada Constituency) ఇన్​ఛార్జి ఏనుగు రవీందర్​ రెడ్డి (Ex MLA Enugu Ravinder Reddy) అన్నారు. వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.

మరికొన్ని రోజుల్లో జరుగనున్న లోకల్​ బాడీ ఎలక్షన్లపై కులంకషంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పర్యటనలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.