52
అక్షరటుడే,బాల్కొండ : Minister Seethakka | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) అభ్యర్థులను గెలిపించినట్లుగానే రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ (Municipal Elections) కాంగ్రెస్ కార్యకర్తలు తమ సత్తా చాటాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Minister Seethakka | సావెల్ నుంచి తడపాకల్ వరకు..
మెండోరా మండలం (Mendora Mandal) సావెల్ గ్రామం నుంచి తడపాకల్ వరకు రూ.2.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే రాబోయే పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం (Basara to Bhadrachalam) వరకు అభివృద్ధి పనుల కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు.