అక్షరటుడే, ఆర్మూర్ : Armoor BJP | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆర్మూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ముందస్తు సమావేశాన్ని శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో (MLA Camp Office) నిర్వహించారు.
Armoor BJP | బోగస్ ఓట్లపై ఫిర్యాదులివ్వాలి..
ఓటర్ లిస్ట్‌లోని తప్పులను, బోగస్ ఓట్లను ప్రక్షాళన చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై చర్చించారు. స్థానికంగా లేని ఓటర్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించే విధంగా కార్యచరణ మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, కార్యదర్శి పోల్కం వేణు, మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల శీను, ధ్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, కందీశ్ ప్రశాంత్, జాగిర్ధర్ శీను, సుంకరి రంగన్న, ఆకుల రాజు, ఉపాధ్యక్షుడు బాండ్లపల్లి నర్సిరెడ్డి, బ్యావత్ సాయి కుమార్, విజయ్ ఆనంద్, కుక్కునూరు లింగన్న, పిట్ల శ్రీధర్, బీజేవైఎం అధ్యక్షుడు ఉదయ గౌడ్, దళిత మోర్చా అధ్యక్షుడు శేఖర్, పులి యుగంధర్, కుమార్, అల్జాపూర్ రాజేష్, మిరియాల కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.