అక్షరటుడే, ఇందూరు: Savitribai Phule | మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని నమ్మి వారి ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని నిజామాబాద్ మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangham) జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.
Savitribai Phule | ధీరవనిత సావిత్రిబాయి పూలే..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. బాలికలు చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని అన్నారు. ఆనాటి సమాజంలో కట్టుబాట్లను ఎదురించి బాలికలను చదువు చెప్పేందుకు బయటకు వచ్చిన ధీర వనిత ఆమె అని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఆనాడు వేసిన ధైర్యమైన అడుగులే నేటి మహిళలకు ఆదర్శంగా మారాయన్నారు. సావిత్రిబాయి ఆనాడు తీసుకున్న ధైర్యమైన నిర్ణయం కారణంగానే నేటి మహిళలు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారన్నారు.
Savitribai Phule | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం అభినందనీయం..
మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా మున్నూరు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ పటేల్ వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవి పటేల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గౌరవ అతిథులుగా డాక్టర్ దేవకీదేవి, సహాయ ఆచార్యులు డాక్టర్ సుమలత హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, సలహాదారులు అబ్బాయి లింబాద్రి పటేల్, చిట్టి నారాయణరెడ్డి పటేల్, కోశాధికారి బాశెట్టి సురేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు మోహన్, పాల జనార్ధన్, సాయికుమార్, చల్ల సత్యనారాయణ పటేల్, అర్జున్, శేఖర్ పటేల్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రంతో పాటు మెమోంటోలు అందజేశారు.
