May Day | మేడే స్ఫూర్తితో పోరాడాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి :May Day | మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్​ గౌడ్​(CITU District Secretary Venkat Goud) అన్నారు. మేడే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి మున్సిపల్​ కమిషనర్​ మహేష్​కుమార్(Mahesh Kumar) హాజరయ్యారు. అనంతరం వెంకట్​ గౌడ్​ మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం(Central Government) కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్​ కోడ్​లను తీసుకొచ్చిందన్నారు. మేం 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకన్న, దేవకర్న మహేందర్, సాయన్న, విజయేందర్, వేణు గౌడ్, శ్యామ్, సద్దాం, విజయ్, మహేందర్, సాయిబాబు, రాములు, పద్మ, శోభ, లలిత తదితరులు పాల్గొన్నారు.

May Day | విద్యుత్​ శాఖ కార్యాలయంలో..

మేడే సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు 1004 యూనియన్ నాయకులు అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజా గౌడ్, కార్యదర్శి కాశీరాం, సహ కార్యదర్శి అమృనాయక్, బాలకిషన్ గౌడ్, పాండు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.