HomeUncategorizedOperation Sindoor | పాక్​ను తీవ్రంగా దెబ్బకొట్టాం.. ఆ దేశం చెప్పుకోవడం లేదు

Operation Sindoor | పాక్​ను తీవ్రంగా దెబ్బకొట్టాం.. ఆ దేశం చెప్పుకోవడం లేదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ అనంతరం జరిగిన పరిణామాలతో భారత్​ పాక్​పై దాడులు చేసిందని డీజీఎంవోలు DGMO తెలిపారు. ఈ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్​.. తనకు జరిగిన డ్యామేజీ గురించి చెప్పుకోవడం లేదన్నారు. డీజీఎంవో రాజీవ్​ఘాయ్​, ఎయిర్​ మార్షల్​ ఏకే భారతి, నేవీ చీఫ్​ ప్రమోద్​ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్​ సిందూర్​ చేపట్టామని తెలిపారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ pakistan​ తమపై దాడి చేస్తుందని అనుకుంటోందన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్​ అండగా నిలిచిందని పేర్కొన్నారు.

Operation Sindoor | ఆట కట్టించిన ‘ఆకాశ్’

ఉగ్రవాదులపై భారత్​ దాడులకు ప్రతీకారంగా పాక్​ ​ వివిధ రకాల డ్రోన్​లను ప్రయోగించిందన్నారు. వివిధ రకాల ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థలతో air defence systems పాకిస్తాన్​ను అడ్డుకున్నామని చెప్పారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్​ క్షిపణులతో akash missile విజయవంతంగా శత్రువును అడ్డుకున్నట్లు తెలిపారు. చైనా తయారు చేసిన పీ–15 మిస్సైళ్లతో పాక్​ దాడి చేసిందన్నారు. వాటిని ఆకాశ్​ క్షిపణులతో నిర్వీర్యం చేశామని చెప్పారు. టర్కీ డ్రోన్లను దాయాది దేశం ఉపయోగించిందన్నారు. భారత్​ను ఏ దేశ ఆయుధాలు ఏమీ చేయలేవన్నారు.

Operation Sindoor | సర్వ సన్నద్ధంగా సైన్యం

ప్రస్తుత పరిస్థితుల్లో భారత దళాలు ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారన్నారు. పాకిస్తాన్​ నూర్​ఖాన్​ ఎయిర్​బేస్​పై ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ చేసిన దాడిలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఎయిర్​బేస్​ రన్​వే తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. 9, 10 తేదీల్లో పాకిస్తాన్​ మన వైమానిక స్థావరాలే టార్గెట్​గా దాడులు చేసేందుకు యత్నించిందన్నారు. మల్టీ లెవల్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం పాక్​ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుందన్నారు.

Operation Sindoor | అణుస్థావరాలపై దాడులు చేయలేదు

ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని అధికారులు తెలిపారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను కూడా టార్గెట్​ చేసుకుంటున్నారని వివరించారు. ఉగ్రవాదులను అంతం చేయడమే భారత్​ లక్ష్యమన్నారు. పాకిస్తాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేయలేదని ఎయిర్​ మార్షల్​ ఏకే భారతి తెలిపారు. పాక్​లోని కిరాణ హిల్ష్​పై దాడి చేయలేదన్నారు. అక్కడ ఏముందో తమకు తెలియని చెప్పారు. అయితే పాక్​లోని రక్షణ వ్యవస్థలను నాశనం చేశామని ఆయన వివరించారు.