అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్ల రికవరీ కోసం (Phone recovery) ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
తాజాగా.. ఈ టీం సభ్యులు రూ.25 లక్షల విలువ చేసే 157 మొబైల్స్ రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సీఈఐఆర్ పోర్టల్ (CEIR Portal) ద్వారా ఈ వారంలో 968 ఫోన్లు, పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,862 ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు.
ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే సిమ్ బ్లాక్ (SIM) చేసి కొత్త సిమ్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత డేటా పోయే ప్రమాదం ఉందన్నారు. రికవరీ చేసిన ఫోన్ల కోసం జిల్లా కార్యాలయానికి వచ్చి పొందాలని ఎస్పీ సూచించారు.
1 comment
[…] విగ్రహానికి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ […]
Comments are closed.