Homeజిల్లాలునిజామాబాద్​Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించామని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. జక్రాన్​పల్లి (jakranpally) మండలం అర్గుల్​లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అధ్యక్షతన ఆదివారం ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం (mahalaxmi Scheme) వల్ల మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని చెప్పుకొచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు (Ration cards) ఇస్తున్నామన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Illu) మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మానాల మోహన్​రెడ్డి, ఆర్మూర్​, బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జీలు పొద్దుటూరి వినయ్​రెడ్డి, ముత్యాల సునీల్​ తదితరులు పాల్గొన్నారు.