అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP CM Chandrababu | మొంథా తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్‌తో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో నష్టం తగ్గింది.
తుపాన్ సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారిని సీఎం క్యాంపు కార్యాలయం(CM Camp Office)లో చంద్రబాబు అభినందించారు. సైక్లోన్ మొంథా (Cyclone Montha) ఫైటర్లుగా గౌరవిస్తూ.. సర్టిఫికెట్లు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. తుపాన్ అలర్ట్ నుంచే ట్రాకింగ్ మొదలు పెట్టామన్ఆనరు. ఇంత పెద్ద తుపాన్ వచ్చినా ఇద్దరు మాత్రమే మృతి చెందారని చెప్పారు.
AP CM Chandrababu | టెక్నాలజీతో..
టెక్నాలజీని ఉపయోగించి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశామని చంద్రబాబు (CM Chandrababu) వెల్లడించారు. డ్రోన్లతో ఒంగోలులో మున్నా అనే వ్యక్తిని కాపాడినట్లు చెప్పారు. టౌన్లలో సీసీ కెమెరాలతో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు తగ్గించినట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, రెవెన్యూ సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. రాబోయేరోజుల్లోనూ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.రాష్ట్ర ప్రజల తరఫున అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందికి ప్రశంసపత్రాలు అందించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తుపాన్ డేటాను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.