ePaper
More
    HomeతెలంగాణCM Revanth | రూ.తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా జమ చేశాం: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | రూ.తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా జమ చేశాం: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా (Rythu Bharosa) జమ చేశామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రైతు భరోసా విజయవంతంగా జమ చేసిన సందర్భంగా మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం (Rythu Nestham) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

    CM Revanth | వ్యవసాయాన్ని పండుగ చేశాం

    భూమి చుట్టూనే తెలంగాణలో పోరాటాలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి.. వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చామమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్సే అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతులేనన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ (KCR) ఎగ్గొట్టిన రైతు బంధు (Rythu Bandhu) నిధులను కూడా తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అన్నారని, తాము మాత్రం సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

    CM Revanth | ప్రాజెక్ట్​లు పూర్తి చేయలేదు

    పదేళ్లలో బీఆర్ఎస్‌ (BRS) ప్రభుత్వం ఏ సాగునీటి ప్రాజెక్టును చేపట్టలేదని రేవంత్​రెడ్డి విమర్శించారు. పేరు మార్చి, ఊరు మార్చి.. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఇప్పుడు కాళేశ్వరం.. కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కల్వకుర్తి, బీమా, సీతారామ, ఇందిరాసాగర్‌.. ఇలా ఏ ప్రాజెక్టును కూడా కేసీఆర్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం.. మొత్తం వివరాలతో నేను సభకు వస్తా.. నువ్వు వస్తావా’’.. అని మాజీ సీఎం కేసీఆర్​కు సవాల్​ విసిరారు.

    CM Revanth | వాళ్లు సంపన్నులు ఎలా అయ్యారు?

    బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని సీఎం ఆరోపించారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్రం దివాళా తీసినా.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఎలా సంపన్నులు అయ్యారని ప్రశ్నించారు. వారికి ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయన్నారు.

    CM Revanth | మహిళల అభివృద్ధికి చర్యలు

    కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సౌర విద్యుత్​ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు బస్సులను కొనుగోలు చేయించామని చెప్పారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...