ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Ponnam Prabhakar | ఆర్టీసీకి జీవం పోశాం: మంత్రి పొన్నం

    Minister Ponnam Prabhakar | ఆర్టీసీకి జీవం పోశాం: మంత్రి పొన్నం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Minister Ponnam Prabhakar | గత బీఆర్​ఎస్​ పాలనలో ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా చేశారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవం పోసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో నూతన బస్టాండ్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని (Mahalakshmi Scheme) అమలు చేసి మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఏడాది దాటినా పథకం నిరాటంకంగా కొనసాగుతోందని.. కోట్ల మంది మహిళలు ఉచిత పథకాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఎల్లారెడ్డి బస్​డిపో కావాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు (MLA Madan Mohan Rao) కోరారని..సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

    Minister Ponnam Prabhakar | దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్​కార్డు

    ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రైతన్నల శ్రేయస్సు కోసం పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. 18నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.

    Minister Ponnam Prabhakar | ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులే కీలకం..

    తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులే కీలకంగా పనిచేశారని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం ఆధ్వర్యంలో శతవిధాల ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన బస్ డిపోలు ఏర్పాటు చేశామని అన్నారు.

    ఎల్లారెడ్డిని అన్ని రంగాల అభివృద్ధి చేస్తా..

    ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ డిపోను మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్​ను ప్రజల తరఫున ఆయన కోరారు. వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​ రావు, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ రాజేష్​ చంద్ర, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రవణ్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...