Operation Sindoor | పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం: కేంద్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Operation Sindoor | పాకిస్తాన్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని కేంద్రం తెలిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ vikram misri, కల్నల్​ సోఫియా ఖురేషీ sofia khureshi, ఎయిర్​ఫోర్స్​ వింగ్​ కమాండ్​ వ్యోమికాసింగ్ vyomika singh శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి పలు నగరాలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ దాడులకు పాల్పడిందన్నారు. భారత గగనతలంలోకి డ్రోన్లు, విమానాలు వచ్చాయన్నారు. పాకిస్తాన్​ ప్రయోగించిన డ్రోన్​లను paistan drones […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Operation Sindoor | పాకిస్తాన్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని కేంద్రం తెలిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ vikram misri, కల్నల్​ సోఫియా ఖురేషీ sofia khureshi, ఎయిర్​ఫోర్స్​ వింగ్​ కమాండ్​ వ్యోమికాసింగ్ vyomika singh శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

నిన్న రాత్రి పలు నగరాలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ దాడులకు పాల్పడిందన్నారు. భారత గగనతలంలోకి డ్రోన్లు, విమానాలు వచ్చాయన్నారు. పాకిస్తాన్​ ప్రయోగించిన డ్రోన్​లను paistan drones సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. నాలుగు ఎయిర్​పోర్టులు లక్ష్యంగా పాక్​ దాడులకు దిగిందని చెప్పారు. 300 – 400 డ్రోన్లతో దాడికి యత్నించిందని తెలిపారు. 36 చోట్ల దాడులకు యత్నించిందని పేర్కొన్నారు. వీటిని భారత్​ సమర్థవంతంగా కూల్చివేసిందని చెప్పారు. డ్రోన్లు టర్కీకి turky drones చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు.

Operation Sindoor | భారత్​ సంయమనం..

ప్రతిదాడుల విషయంలో భారత్​ సంయమనం పాటించిందని పేర్కొన్నారు. భటిండా, ఉదంపూర్​ ఎయిర్​ పోర్టులు లక్ష్యంగా పాక్​ దాడులకు ప్రయత్నం చేసిందని చెప్పారు. భారత్​ ఎదురుదాడిలో పాక్​ భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్​ సంయమనం పాటించిందన్నారు. పౌర విమానాలను రక్షణగా చేసుకుని పాక్​ దాడులు చేస్తోందన్నారు.

Operation Sindoor | గురుద్వారాలు, ఆలయాలే లక్ష్యంగా..

ఎల్​వోసీ వెంబడి పాక్​ నిరంతరాయంగా కాల్పులు జరుపుతోందని చెప్పారు. సరిహద్దులో భారీ ఆర్టిలరీలతో కాల్పులకు జరుపుతోందని వివరించారు. మన గురుద్వారాలు, ఆలయాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని భావించిందని చెప్పారు. కర్తార్​పూర్​ కారిడార్​ను మూసివేశామని చెప్పారు.

Related articles

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.

Nizamabad Deputy Mayor | డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సందర్భంగా ఆమెకు మేయర్​ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.