ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | పాక్​ ఎయిర్​బేస్​లు, రాడార్​ వ్యవస్థలను ధ్వంసం చేశాం

    Operation Sindoor | పాక్​ ఎయిర్​బేస్​లు, రాడార్​ వ్యవస్థలను ధ్వంసం చేశాం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పాక్​ ఎయిర్​బేస్​లు, ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం, మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు త్రివిద దళాదిపతులు తెలిపారు. డీజీఎంవో రాజీవ్​ఘాయ్​, ఎయిర్​ మార్షల్​ ఏకే భారతి, నేవీ చీఫ్​ ప్రమోద్​ ఆదివారం మీడియాతో మాట్లాడారు. పహల్ గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారన్నారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్​ సిందూర్ చేపట్టామన్నారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారన్నారు. ఇందులో పలువురు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు.

    Operation Sindoor | ప్రజలే లక్ష్యంగా పాక్​ దాడులు

    ఉగ్రవాదుల అంతానికే ఆపరేషన్​ సిందూర్​ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మనం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తే.. పాక్​ మాత్రం పౌరులు, ఆలయాలపై దాడులకు యత్నించిందన్నారు. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేసిందని పేర్కొన్నారు. అయితే భారత ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం, వైమానిక దళం పాక్​ దాడులను తిప్పికొట్టాయని వివరించారు.

    Operation Sindoor | 40 మంది పాక్​ సైనికుల మృతి

    ఎల్​వోసీ వెంబడి పాక్​ కాల్పులకు తెగబగడంతో భారత్​ ప్రతిదాడులు చేసిందన్నారు. ఈ ఘటనలో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పౌర విమానాలను రక్షణగా పెట్టుకొని పాక్​ దాడులకు పాల్పడిందన్నారు. దీంతో సంయమనంతో ఎదురు దాడులు చేశామని వివరించారు.

    Operation Sindoor | పాక్​ దాడులను తిప్పికొట్టాం

    ఆపరేషన్​ సిందూర్​ తర్వాత నిత్యం పాక్​ డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు దాడులు చేసిందన్నారు. అయితే మన రక్షణ వ్యవస్థ దాడులను తిప్పికొట్టిందన్నారు. పాక్​ దాడులతో భారత్​కు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయితే పాక్​ దాడులను తిప్పి కొట్టడానికి భారత వైమానిక దళం ప్రతిదాడులు చేసిందన్నారు. మన సత్తా చాటడానికి భారీ క్షిపణులతో దాడులు చేశామన్నారు. లాహోర్​లోని రాడార్​ వ్యవస్థను ధ్వంసం చేశామని చెప్పారు. మిలిటరీ స్థావరాలు, పసునూర్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేశామన్నారు. రాడార్​ సిస్టంలపై దాడులు చేశామని వివరించారు.

    Operation Sindoor | బలగాలకు పూర్తి స్వేచ్ఛ..

    ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. అయితే శనివారం రాత్రి పాక్​ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు పేర్కొన్నారు. పాక్​ దాడులను తిప్పికొట్టామని, ఒప్పంద ఉల్లంఘన విషయాన్ని పాక్​ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే మళ్లీ పాక్​ దాడులకు పాల్పడితే తీవ్రంగా దాడులు చేయాలని బలగాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే పాక్‌లోని సైనిక స్థావరాలను పూర్తిగా నిర్వీర్వం చేశామని వివరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...