ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక...

    Operation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ రాహుల్‌ ఆర్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాలను యుద్ధ రంగంలో ఓడించామని ఆయన తెలిపారు. ఫిక్కి నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ (New Age Military Technologies) కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూరు(Operation Sindoor) చేపట్టి పాక్​, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్​ దెబ్బతో షాకైన పాక్​ తర్వాత డ్రోన్లు, క్షిపణులతో భారత్​పై దాడులు చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను అడ్డుకుంది.

    READ ALSO  Nimisha Priya | నిమిష‌ప్రియ ఉరిశిక్ష ర‌ద్దు.. ప్ర‌క‌టించిన కేఏ పాల్‌

    Operation Sindoor | ఆ దేశాలను ఓడించాం

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​(Pakistan)కు తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసింది. చైనా కూడా ఆయుధాలు అందించినట్లు సమాచారం. పాక్​ పలు చైనా క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తాజాగా రాహుల్‌ ఆర్‌సింగ్‌(Rahul R Singh) మాట్లాడుతూ.. పాక్‌తో పాటు చైనా, తుర్కియేను ఓడించామన్నారు.
    చైనా పాకిస్తాన్‌ను లైవ్‌ ల్యాబ్‌లా వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్​ ప్రయోగించిన పలు చైనా మిసైళ్లు(Chinese Missiles) పని లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయి. అలాగే చైనా నుంచి పాక్​ కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత దాడులను అడ్డుకోలేకపోయింది. అదే సమయంలో భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 సిస్టమ్​ సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు చేశారు. తుర్కియే పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా పాకిస్తాన్‌కు ప్రత్యక్ష కార్యాచరణ డేటాను అందించిందని, భారత్​పై నిఘా ఉంచిందని ఆయన తెలిపారు.

    READ ALSO  Railway | రైలు ప్రయాణికులకు అలర్ట్​.. పెద్దపల్లి జంక్షన్​లో బైపాస్​ రైల్వే మార్గం నిర్మాణం.. పలు రైళ్లు రద్దు..

    Latest articles

    Contract employees | కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Contract employees | ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​...

    Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad)​...

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు...

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి...

    More like this