Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Town | పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తున్న ఏపీ ప్రభుత్వం

Kamareddy Town | పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తున్న ఏపీ ప్రభుత్వం

పత్రికా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం అణిచివేస్తోందని ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు నినదించారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Town | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (Andhra Pradesh government) పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తోందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ అన్నారు. ‘సాక్షి’ పత్రిక కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తూ శుక్రవారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) మున్సిపల్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

అనంతరం ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. వాస్తవాలు వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘సాక్షి’ (Sakshi ) ఎడిటర్‌తో పాటు జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.