అక్షరటుడే, ఆర్మూర్: Armoor | జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్‌క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌కు (Armoor SHO Satyanarayana Goud) మంగళవారం జర్నలిస్టులంతా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన జర్నలిస్టులపై పోలీస్ కానిస్టేబుళ్లు (police constables) దురుసు ప్రవర్తన కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పోలీస్ సిబ్బంది దినేష్, అశోక్‌లు తరచూ జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవహేళన చేస్తున్నారని, కావాలని ప్రెస్‌క్లబ్ సభ్యుల వాహనాలకు జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు.
కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దెం, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పద్మారావు, సీనియర్ జర్నలిస్టులు సాత్పూతే శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, నరేందర్, మనోహర్, క్రాంతి కుమార్, చరణ్ గౌడ్, మహిపాల్, గణేష్, సురేందర్ గౌడ్, గణేష్ గౌడ్, అరుణ్, చిరంజీవి, సురేష్, సురేష్ బాబు, అశోక్, చేతన్, కిరణ్, దినేష్, రితీష్, రాకేష్, వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు.