ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | వికసిత్​ భారత్​ లక్ష్యంగా పనిచేస్తున్నాం

    Mla Dhanpal | వికసిత్​ భారత్​ లక్ష్యంగా పనిచేస్తున్నాం

    Published on

    అక్షరటుడే ఇందూరు: Mla Dhanpal | వికసిత్​ భారత్​ (Viksit Bharat) లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం నగరంలోని సందీప్ గార్డెన్​లో బీజేపీ అర్బన్ నియోజకవర్గ (Urban Constituency) కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 11 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క రూపాయి కుంభకోణం లేకుండా దేశానికి సుపరిపాలన అందించామన్నారు.

    గరీబ్ కళ్యాణ్ యోజన (Garib Kalyan Yojana) కింద దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో ఇచ్చే సన్నబియ్యంలో అధిక వాటా కేంద్రానిదేనని గుర్తు చేశారు. ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మాణానికి సహకారం అందిస్తే.. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Illu) అంటూ మోసం చేస్తోందన్నారు. జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు (Vande Bharat trains), 23 నగరాల్లో మెట్రో సేవలతో పాటు అమృత్ 2.0 కింద పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...