అక్షరటుడే, ఇందూరు : Gauthami Naresh Reddy | తనను గెలిపిస్తే 24వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని అంతిరెడ్డి గౌతమి నరేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు చంద్రనగర్ (Chandranagar)లో బుధవారం ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Gauthami Naresh Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున..
ఈ సందర్భంగా అంతిరెడ్డి గౌతమి నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలో ఉంది కాబట్టి డివిజన్లోనూ అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇప్పటికే అనేక పథకాలు అమల్లోకి వచ్చి పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.
Gauthami Naresh Reddy | తాగునీరు, డ్రెయినేజీ సమస్యల పరిష్కారం..
24వ డివిజన్లో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని అంతిరెడ్డి గౌతమి నరేష్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation)లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.