అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ఎల్లారెడ్డి పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
MLA Madan Mohan | అభివృద్ధి పనుల పరిశీలన
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)లోని 8, 9, 10, 12వ వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వార్డులో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ తదితర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి సంఘం సభ్యులు, మన్నె సంఘం సభ్యుల అభ్యర్థన మేరకు ఉప్పరి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.3 లక్షల ప్రొసీడింగ్ అందజేశారు. అలాగే మన్నె సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికీ రూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.
MLA Madan Mohan | శరవేగంగా అభివృద్ధి
ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందన్నారు. ముఖ్యంగా బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేసి చూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటామని, ఎల్లారెడ్డి పట్టణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.