ePaper
More
    HomeతెలంగాణMla Laxmi Kantha Rao | మౌలిక వసతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..: ఎమ్మెల్యే

    Mla Laxmi Kantha Rao | మౌలిక వసతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..: ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Thota Laxmi Kantha Rao) తెలిపారు. జుక్కల్​ మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో శుక్రవారం పనులజాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు రూ. 2,198.83 కోట్ల వ్యయంతో 1,01,589 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

    Mla Laxmi Kantha Rao | పనుల జాతరలో..

    ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, పొలాలకు మట్టి రోడ్లు, చెక్ డ్యామ్​లు, ఊట కుంటల నిర్మాణం, గ్రామీణ రోడ్లు, పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాల నిర్మాణం, నర్సరీల పెంపకం, అంగన్​వాడీ, గ్రామ పంచాయతీ భవనాల (Gram Panchayat Buildings) నిర్మాణాలు తదితర పనులు చేపడతామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖండేబల్లూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోవింద్ (Deputy Sarpanch Govind) ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. అనంతరం గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    ACB Raid | ఏసీబీకి చిక్కిన జాయింట్​ సబ్​ రిజిస్ట్రార్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ (ACB) అధికారుల వరుస కేసులతో అవినీతి అధికారుల గుండెళ్లో...

    Vinayaka Chavithi | గణేశ్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Vinayaka Chavithi | నియోజకవర్గంలో గణేశ్​ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి (RDO...

    Shabbir Ali | ప్రభుత్వ పథకాలతో ప్రజల కళ్లలో ఆనందం : షబ్బీర్​అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hyderabad | వీడిన కూకట్‌పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ.. నిందితుడు పదో తరగతి బాలుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hyderabad | హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌(Sangeetnagar)లో 11 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు...

    More like this