అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Shabbir Ali | నగరంలో తాగునీటి సమస్య (drinking water problem) పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) అన్నారు. ఈ మేరకు నగరంలో రూ.6.50 కోట్ల వ్యయంతో ఆధునిక నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు.
Shabbir Ali | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో..
తాగునీటి ట్యాంకుల (drinking water tank) నిర్మాణ పనుల ప్రారంభోత్సవం అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి అంశాలపై షబ్బీర్ అలీ చర్చించారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణను దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
Shabbir Ali | ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు..
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) ప్రధాన లక్ష్యమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నీరు ప్రజల ప్రాథమిక హక్కు అని వేసవిలో ప్రతిఇంట్లో నీటికి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ట్యాంకుల నిర్మాణం పూర్తయితే.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలియజేశారు.
Shabbir Ali | ఆటోనగర్‌లో..
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోనగర్ ప్రాంతంలో రూ.2.50కోట్లతో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల భారీ వాటర్ ట్యాంకును నిర్మించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆటోనగర్‌తో పాటు పరిసర కాలనీలకు నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. అలాగే సైలానీ నగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో 9 లక్షల లీటర్ల సామర్థ్యం గల మరో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు.
Shabbir Ali | మదీనా మార్గ్‌లో..
ఇదేవిధంగా మదీనా ఈద్గా సమీపంలో రూ.1.50 కోట్ల వ్యయంతో 9 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి షబ్బీర్‌అలీ శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ ద్వారా మదీనా ఈద్గా పరిసర కాలనీల ప్రజలకు నిరంతర, సమృద్ధి నీటి సరఫరా అందనుందని తెలిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధి నా బాధ్యత అని ఆయన వెల్లడించారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.