అక్షరటుడే, కామారెడ్డి: Minister Jupally | కామారెడ్డి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism Minister Jupally Krishna Rao) తెలిపారు. సోమవారం శాసన సభలో (Legislative Assembly) జీరో అవర్‌లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Jukkal MLA Laxmikantha Rao) పర్యాటక రంగంపై ప్రభుత్వ స్పందనను కోరగా మంత్రి జూపల్లి స్పందించారు.
Minister Jupally | స్వయంగా పర్యాటక ప్రదేశాల సందర్శన..
తాను స్వయంగా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించానన్నారు. నిజాంసాగర్ (Nizam Sagar), కౌలాస్ కోట, నాగన్నబావి (Nagannabavi) ప్రాంతాలను చూశానని తెలిపారు. అలాగే వెలుగులోకి రాని ప్రాంతాలను స్టడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్–2లో భాగంగా సీబీడీడీ స్కీం కింద నిజాంసాగర్ ఎకో టూరిజం కోసం రూ.9.97 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ 17 పర్యావరణ అనుకూల మాడ్యులర్ కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్లు, ప్రవేశ ద్వారాలు, స్పా, వెల్నెస్ కేంద్రాలు, ఆర్చ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
ల్యాండ్ స్కేపింగ్, పాత్ వేస్ పనులు కూడా చేపడుతున్నట్టు వివరించారు. దీనివల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కౌలాస్ కోట పురాతమైన, ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏకీకృత పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. మౌలిక సదుపాయాలు, వారసత్వ సంరక్షణ దృష్టిలో ఉంచుకుని పిపిపి వంటి నమూనాలు తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కౌలాస్ కోట వారసత్వ సంరక్షణకు 13 వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు రూ.50 లక్షల నిధులతో పనులు చేపట్టామన్నారు. కోటను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రూ.5కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు.