అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | కృష్ణా, గోదావరి జలాలపై ప్రత్యేకంగా చర్చించడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్తో చర్చకు రెడీగా ఉన్నామంటూ సవాల్ విసిరారు. హైదరాబాద్లోని జూబ్లీహ్సిల్సలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ (KCR) ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై మూడు రోజులు కూలంకశంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా, తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) తీవ్రమైన అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణకు రావాల్సిన హక్కులను కాపాడుతున్నామని చెప్పారు.
CM Revanth Reddy | లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించాక నిర్ణయం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతో సైతం ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాతే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.