అక్షరటుడే, బోధన్: Nizamabad Collector | రబీ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక వేస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను (fertilizer godown) కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nizamabad Collector | రికార్డుల తనిఖీ..
గిడ్డంగిలో రికార్డుల్లో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయాలేదా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. ఎరువుల విక్రయాలను ఈపాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి, ఎరువులను గోడౌన్‌కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా.. ఎరువుల నిల్వలతో (fertilizer stocks) కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.