ఉఅక్షరటుడే, ఇందూరు: Fee reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు అభ్యర్థించామని, తమ ఓపిక నశించిందని ప్రైవేట్ కళాశాల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్ కళాశాలలో (Care College) సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి రాకముందు ఫీజు రీయింబర్స్మెంట్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఇవ్వలేకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం రెండేళ్లకోసారి ఇవ్వడంతోనే అనేక సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం అసలే ఇవ్వడం లేదని వాపోయారు.
గతంలో సమ్మె నిర్వహిస్తే ప్రభుత్వం తమతో మాట్లాడి విరమించుకోవాలని సూచించిందన్నారు. కానీ 10 శాతం బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. ఒక కళాశాల నడపడానికి ప్రతి నెలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల అవసరం పడతాయన్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యామని, బంగారు నగలు తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారామన్నారు. ఇకనైనా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మారయ్య గౌడ్, దాసరి శంకర్, సూర్యప్రకాష్, దత్తు, శ్రీనివాస్, బాలకృష్ణ, శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
