అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన జపాన్‌లోని కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి (Kazuhisa Takeuchi) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కిటాక్యుషు సహకారం కోసం ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. గత ఏప్రిల్‌లో జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అక్కడి మేయర్ కజుహిసా టెక్యూచితో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు సంస్థలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్(LoI) కుదుర్చుకున్నారు.
CM Revanth Reddy | ఎకో టౌన్ మోడల్‌తో ప్రేరణ పొందా
కిటాక్యూషు నగర మేయర్‌తో (Mayor of Kitakyushu) భేటీ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జపాన్ పర్యటన సందర్భంగా కిటాక్యూషు నగర ఎకో-టౌన్ మాడల్‌తో చాలా ప్రేరణ పొందానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అలాంటి నమూనాను హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం కోసం అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిందన్నారు.
CM Revanth Reddy | మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి
మూసీ నది (Musi River) అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. జపాన్‌లో అవకాశాలను అన్వేషించాలన్న అభిలాషతో ఇక్కడి విద్యార్థులు జపనీస్ భాషను ((Japanese language) నేర్చుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. మీ సహకారంతో ఔత్సాహికులకు జపనీస్ నేర్పించాలని భావిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ (Hyderabad) నుంచి నేరుగా కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ‘కిటాక్యుషు నగర నాయకత్వాన్ని (leadership of Kitakyushu city) అభినందిస్తున్నాను. ఈ నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. రెండింటి మధ్య స్నేహం సుదీర్ఘ కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.