Homeజిల్లాలుకామారెడ్డిJukkal MLA | పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

Jukkal MLA | పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మద్నూర్​ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని సోమవారం ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Lakshmikanth Rao) అన్నారు. మద్నూర్​ మండల కేంద్రంలో (Madnoor Mandal Center) లబ్ధిదారు గుడాల్వర్ సవిత నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో సోమవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు (double bedroom house) కూడా మంజూరు కాలేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జుక్కల్​ నియోజకవర్గంలో (Jukkal constituency) మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. చాలా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశాలు సైతం చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల హామీని పూర్తి చేస్తున్నామన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News