అక్షరటుడే, లింగంపేట: Indiramma Houses | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాళ్ల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పేర్కొన్నారు. లింగంపేట మండంలోని మోతెలో పూర్తయిన మొదటి ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో శివయ్య, జ్యోతి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పట్టువస్త్రాలను అందజేశారు.
Indiramma Houses | నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి (Yellareddy constituency) 3,500 ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Houses) మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పేదోడి కలను నెరవేర్చడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నారా గౌడ్, నాయకులు సంతోష్ రెడ్డి, రాంరెడ్డి, సాయిరాం యాదవ్, మోహిత్, బైరయ్య తదితరులు పాల్గొన్నారు.