Homeజిల్లాలుకామారెడ్డిMinister Komatireddy | రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy | రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Minister Komatireddy | రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు అధికమొత్తంలో నిధులిస్తున్నామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు. పిట్లం(Pitlam) మండలం మద్దెల చెరువు రోడ్డు, తిమ్మానగర్ వద్ద ఎఫ్​డీఆర్​ నిధులు (FDR Funds) రూ. 4.86 కోట్లతో నిర్మించిన హైలెవెల్​ వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను మెరుగుపర్చాలనే కృతనిశ్చయంతో రేవంత్​రెడ్డి (CM Revanth reddy) సర్కారు ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్​ షెట్కార్(MP Suresh Shetkar)​, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao), నారాయణఖేడ్​ ఎమ్మెల్యే సంజీవరెడ్డి (MLA Sanjeeva Reddy), కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​(Collector Ashish Sangwan), బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి (Sub Collector Kiranmayi) తదితరులు పాల్గొన్నారు.

Minister Komatireddy | మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్​ శ్రేణులు..

జిల్లాకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్​ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండలంలోని నర్సింగ్రావు పల్లి చౌరస్తా వద్ద ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్​తో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Minister Komatireddy | మంత్రి పర్యటన షెడ్యూల్​ ఇదే..

మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి మధ్యాహ్నం డోంగ్లీలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బిచ్కుందలో (Binchkunda) పబ్లిక్​ మీటింగ్​లో పాల్గొననున్నారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో కలిసి జుక్కల్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఇటీవల అకాలమరణం చెందిన సీనియర్​ జర్నలిస్ట్​ దత్తురెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మంత్రికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్​ శ్రేణులు

Minister Komatireddy | డోంగ్లీ రోడ్డుకు శంకుస్థాపన..

అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద నుంచి డోంగ్లి వరకు రూ.13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేశ్​ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Minister Komatireddy | పంచాయతీ రోడ్లను రోడ్ల భవనాల శాఖ పరిధిలోకి తేవాలి..

అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్​ మండలంలోని పలు పంచాయతీరాజ్​ రోడ్లను, రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి తీసుకురావాలని పిట్లం మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ చోకోటి మనోజ్​కుమార్​ పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని మనోజ్​కుమార్​తో పాటు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఎన్నారై భాస్కర్​రెడ్డి, పిట్లం మండల సీనియర్​ నాయకులు అడ్వకేట్​ రాంరెడ్డి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి సిరిసిల్ల మీదుగా పిట్లం వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరయ్యేలా చూడాలని కోరారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ చూపాలంటూ వారు మంత్రికి విన్నవించారు.