అక్షరటుడే, ఇందల్వాయి: Mla BHupathi Reddy | ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయ (Yellamma Temple) పునర్నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 60ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరడంతో గౌడ కులస్థులందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఆలయ పునర్నిర్మాణం చేయిస్తుండడంపై ఆయన అభినందించారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆలయం ఎదుట డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇవ్వాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ (BC Reservation) కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.