HomeUncategorizedSupport For The India | దేశ సేవకు మనం సైతం..

Support For The India | దేశ సేవకు మనం సైతం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Support For The India | సరిహద్దు(Border)ల్లో ఉండి దేశ రక్షణ కోసం మన సైనికులు(Soldiers) పోరాడుతున్నారు. శత్రుదేశం పీచమణచడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరులో ముందుకు ఉరుకుతున్నారు. ఈ క్రమంలో పలువురు మృత్యువాతపడుతున్నా వెనుకంజ వేయడం లేదు. అయితే మాతృభూమి రక్షణ కోసం ఆయుధాలు ధరించి సరిహద్దుల్లో పోరాడే అదృష్టం అందరికీ రాదు.. కానీ మనం సైతం దేశ సేవలో భాగస్వాములం కావచ్చు. దేశానికి ఆపద వచ్చినప్పుడు అండగా నిలబడడం మన బాధ్యత కూడా.. మరి సాధారణ ప్రజలు సైన్యానికి ఎలా అండగా నిలవవచ్చో తెలుసుకుందామా..

యుద్ధం(War) చేయడం అనేది వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఆయుధాలు, సైనిక సంక్షేమానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశ రక్షణ నిధికి విరాళాలు అందించాలి.
గాయపడిన సైనికులకు రక్తం(Blood) అవసరం అవుతుంది. విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, రక్తం సేకరించి మన వీర జవానుల ప్రాణాలను కాపాడవచ్చు.
భారత్‌తో ప్రత్యక్ష పోరులో గెలవలేమని భావిస్తున్న పాక్‌(Pakistan).. తప్పుడు ప్రచారాలకు దిగుతోంది. అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. అయితే పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాన్ని మన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(Press Information Bureau) ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్‌ చెక్‌తో ఖండిస్తోంది. కాబట్టి మన దేశానికి నష్టం కలిగిందంటూ సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. తొందరపడి తప్పుడు ప్రచారాలను సోషల్‌ మీడియా(social media)లో షేర్‌ చేయొద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.
సైనికులకు మద్దతుగా ర్యాలీలు తీయడం, వారి కుటుంబాలకు అండగా ఉండడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నించాలి.నిత్యవసర సరుకులు బ్లాక్‌ చేయడం దేశద్రోహంతో సమానం.
ప్రభుత్వం అందించే సూచనలను తూచా తప్పకుండా పాటించాలి.