అక్షరటుడే, ఇందూరు: Water tanker | నగరంలోని ఓ వాటర్ ట్యాంకర్ రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన ఆనంద్‌నగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
నగరంలోని ఆనంద్ నగర్ (anand nagar)లోని పద్మశాలి సంఘం (padmashali sangham) సమీపంలో ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను తీసుకొచ్చారు. అది తిరిగి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.