అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
పట్టణంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, తహశీల్దార్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ విద్యానగర్(Vidya nagar) కాలనీలోని సాయిబాబా గుడి వద్ద పారిశుధ్య పనులను పరిశీలించారు.
అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో (kamareddy Municipality) డ్రెయినేజీలు బ్లాక్ అయి మురుగునీరు రోడ్ల మీదికి, ఇళ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రెయినేజీలను శుభ్రం చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు. తడి,పొడి చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రతిరోజు వాహనాల ద్వారా చెత్తను సేకరించి డిస్పోజల్ చేయాలని, పట్టణంలో ఎక్కడ వర్షం నీరు నిల్వ ఉండకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు.
దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ (Fogging) చేయాలన్నారు. భారీ వర్షం కురిసినప్పుడు పట్టణ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ముందస్తుగా ప్రచారం కల్పించాలని కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పనిముట్లను అందజేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రెయిన్ కోట్స్, అత్యవసరమైన ఇతర సామగ్రి అందజేసేందుకువెంటనే ప్రపోజల్స్ పంపించాలని కమిషనర్ కు సూచించారు. కలెక్టర్‌తో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు పనిముట్లు అందజేస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్