అక్షరటుడే, ఆర్మూర్ : Gutpa Lift Irrigation | ఆలూర్ మండలం గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేయాలని ఆలూర్ గ్రామస్థులు కోరారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు (Additional Collector Kiran Kumar) ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, వీడీసీ అధ్యక్షుడు మగ్గిడి సూర్యరెడ్డి కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
Gutpa Lift Irrigation | సాగునీటికి ఇబ్బందులు..
ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ (Sarpanch Mukkera Vijay) మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామ రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు వేయడానికి నీటి అవసరం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. వీడీసీ అధ్యక్షుడు మగ్గిడి సూర్య రెడ్డి మాట్లాడుతూ.. గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదలైతే ఆలూర్తో (Alur village) పాటు పరిసర ప్రాంతాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సాగునీటి సదుపాయం కల్పించడం ద్వారా పంట దిగుబడులు పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, తొర్లికొండ ప్రవీణ్, బార్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.