77
అక్షరటుడే, ఆర్మూర్ : Gutpa Lift Irrigation | యాసంగి వరి పంట సాగు కోసం గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని నీటిపారుదల శాఖ (Irrigation Department) అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
Gutpa Lift Irrigation | పొదుపుగా వాడుకోవాలి..
ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. యాసంగి పంటల కోసం రైతుల కోరిక మేరకు లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని పొదుపుగా వాడుకుని శాఖాధికారులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆర్మూర్ సర్కిల్ డీఈ పవన్ కుమార్ (DE Pawan Kumar), నందిపేట్ డీఈఈ రవి కుమార్ (Nandipet DEE Ravi Kumar), ఏఈఈ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.