అక్షరటుడే, బాల్కొండ: Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్‌ను (Yasangi season) నీటివిడుదలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ (Irrigation Department) ఎస్ఈ జగదీష్ సోమవారం వివరాలు వెల్లడించారు.
Sriramsagar Project | ఈనెల 24వ తేదీ నుంచి..
ఎస్సారెస్పీకి అనుబంధంగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలు ఉన్నాయి. అయితే నీట యాజమాన్య కమిటీ నిర్ణయం మేరకు ఖరీఫ్, యాసంగికి (Kharif and Rabi seasons) నీటివిడుదల చేపడుతున్నారు. ఈనెల 3వ తేదీన నీటి యాజమాన్య కమిటీ కాలువలకు నీటి విడుదల కోసం సమావేశమైంది. అనంతరం 24వ తేదీ నుంచి నీటివిడుదల చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో సాగునీటి విడుదల కొనసాగనుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ..సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.