Homeజిల్లాలుకామారెడ్డిIrrigation projects | జలాశయాలకు వరద తగ్గుముఖం

Irrigation projects | జలాశయాలకు వరద తగ్గుముఖం

ఉమ్మడి జిల్లాలో జలాశయాలకు ఇన్​ఫ్లో తగ్గింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో శ్రీరాంసాగర్​లో నీటిమట్టం నిలకడగా ఉంది. అలాగే నిజాంసాగర్​కు స్వల్పంగా వరద వస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి: Irrigation projects | ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలకు వరద తగ్గింది. దీంతో శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​లలో నీటిమట్టం నిలకడగా ఉంది.

Irrigation projects | శ్రీరాంసాగర్​లో..

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 9,654 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.

Irrigation projects | కాల్వల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్టు కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ (Saraswati canal) ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాలువ (kakatiya kaluva), లక్ష్మా కాల్వలకు నీటిని విడుదల చేయడం లేదు. అలాగే 573 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.

Irrigation projects | నిజాంసాగర్​లో..

నిజాంసాగర్​కు (Nizamsagar) వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఒక గేట్​ ద్వారా 2,498 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Must Read
Related News