HomeUncategorizedVande Bharat Train | వందే భార‌త్‌ రైలులో వాటర్​ లీకేజీ.. వీడియో వైరల్​

Vande Bharat Train | వందే భార‌త్‌ రైలులో వాటర్​ లీకేజీ.. వీడియో వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat Train | వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై (Vande Bharat Train) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు ఓ కోచ్‌లో రూఫ్‌ నుంచి నీరు ధారగా కారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే తీరుపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అయ్యింది. ఒక కోచ్‌ నుంచి పైకప్పు నుంచి నీరు కారింది. దీంతో సీట్లు తడిచిపోవడం, ఆ కోచ్‌ ఫ్లోర్‌ నీటితో ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వందే భారత్ ట్రైన్​లో వాటర్ లీక్ అవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Vande Bharat Train | రైలులోకి వర్షపు నీరు..

వివరాల్లోకి వెళితే.. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ట్రైన్​లో వాటర్ లీక్ (Water leaks) కావడంతో ప్రజలు విమర్శలు జారీ చేస్తున్నారు. వారణాసి నుంచి ఢిల్లీకి వెళుతున్న 22415 వందే భారత్ ఎక్స్​ప్రెస్​లో ఏసీ ఔట్​లెట్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. దీంతో ప్రయాణికులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వాటర్ లీకేజ్(water leakage)కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించారని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ (Twit) చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రైన్​లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా వాటర్ లీకేజ్ సమస్య వల్ల ప్రజలు ప్రయాణించే సమయంలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం (Governament) ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే (indian Railway) అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఎన్నో సదుపాయాలతో పాటు కొత్త కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది వందేభారత్‌ రైళ్లను పెంచుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల నుంచి ఈ వందేభారత్‌పై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. టిక్కెట్‌ ధర (ticket Rate) ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ వందే భారత్‌ను ఎంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా వందేభారత్‌ పైకప్పు నుంచి లోనికి నీరు చేర‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.