అక్షరటుడే, ఇందల్వాయి: Gas cylinder | వంటగ్యాస్ (Cooking gas) సిలిండర్ బుక్ చేస్తే ఇంటికి వచ్చిన సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఇందల్వాయిలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయికి (Indalwai) చెందిన తుమ్మల పార్వతి వంట గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో బుక్ చేసుకుంది. డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ డెలివరీ చేసి వెళ్లాడు. అనంతరం పార్వతి సిలిండర్ బిగించి, స్టవ్ వెలిగించగా మంట రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన సిలిండర్‌ను పరిశీలిస్తే పూర్తిగా నీటితో నిండి ఉన్నట్లు గుర్తించింది. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ (Indian Gas Agency) నిర్వాహకులు ఇలా నిర్లక్ష్యంగా సిలిండర్ డెలివరీ చేయడంపై మండిపడింది. అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది.