2
అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai Mandal | మండలంలోని సిర్నాపల్లి స్టేషన్ (Sirnapally Station) వాగు బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది (Gram Panchayat staff) అప్రమత్తమయ్యారు.
ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, వరద తక్కువ ముఖం పట్టేవరకు రోడ్డును మూసివేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సిన వారిని ట్రాక్టర్ పై ఎక్కించి రోడ్డు దాటించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు అక్కడ ఉండి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.