అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ (Housing Board Colony)లో పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ ఎత్తులో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం, రోడ్డు కింది నుంచి కల్వర్టులను నిర్మించకపోవడoతో మూడు కాలనీల నుంచి వస్తున్న వరద నీరు రోడ్డు వద్ద నిలిచిపోయి ఇళ్లలోకి నీరు చేరుతోంది.
గతంలోనూ ఇదే తరహాలో ఇళ్లలోకి వర్షం నీరు చేరగా పరిశీలించిన అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపించకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి భారీఎత్తున కల్వర్టులను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.