Homeజిల్లాలుకామారెడ్డిLingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ అధికారులు ఫీడర్ ఛానల్​కు శనివారం నీటిని మళ్లించారు.

ఈ సందర్భంగా జలవనరుల శాఖ డీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) మల్లారం చెరువు కట్ట తెగిపోవడంతో చెరువు కింద ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతులు (Farmers) సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు అడవి నుంచి వచ్చే నీటిని, ఎల్లారం చెరువు నుంచి వచ్చే నీటిని ఫీడర్​ ఛానల్​ ద్వారా మల్లారం చెరువులో కాలువ తూము వరకు కలిపారు. చెరువు కింద సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు నీటిని ఛానల్​ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఫీడర్ ఛానల్ ద్వారా నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.