Water ATM | ప్రజల కోసం వాటర్​ ఏటీఎంలు.. ఎక్కడో తెలుసా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Water ATM | ప్రస్తుతం నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. అయితే మహా నగరాల్లో గుక్కెడు తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. తాగునీరు దొరకక ప్రజలు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. దీంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో పేదలు, మధ్య తరగతి ప్రజలకు తాగునీటికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Water ATM | ప్రస్తుతం నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. అయితే మహా నగరాల్లో గుక్కెడు తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. తాగునీరు దొరకక ప్రజలు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. దీంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలక నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులో పేదలు, మధ్య తరగతి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది పడకుండా మినరల్ వాటర్ మెషిన్లను(Mineral water machines) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటర్​ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న 50 వాటర్ వెండింగ్ మెషిన్లను సీఎం స్టాలిన్(CM Stalin)​ ప్రారంభించారు.

Water ATM | 24 గంటలు ఉచిత వాటర్​

మెట్రో వాటర్ డెవలప్ మెంట్(Metro Water Development) ఆధ్వర్యంలో ఈ మెషీన్లను ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ మెషిన్ల ద్వారా ఉచిత తాగునీరు అందిస్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు మినరల్ వాటర్(Mineral water) అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నగరంలోని మొత్తం ఆరు జోన్లకు ఈ మెషిన్లను విస్తరించనున్నారు. బీచ్​లు, పార్కులు, ఆలయాలు, బస్ డిపోలు, రైల్వే టెర్మినల్స్, మార్కెట్లు తదితర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వారికి తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది.

Related articles

Kamareddy Chairperson | కామారెడ్డి ఛైర్​పర్సన్​గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ.. భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mexico Cartel Violence | డ్రగ్స్​ డాన్​ హతం.. మెక్సికోలో చెలరేగిన హింస

మెక్సికోలో హింస చెలరేగింది. డ్రగ్స్​ వ్యాపారిని పోలీసులు హతమార్చడంతో కార్టెల్స్​ ప్రతీకార దాడులకు దిగారు.

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.