అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు (Pocharam Project) పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకలను సంతరించుకుంది.
ప్రస్తుతం ఉన్న నీటిమట్టంతో రెండు పంటలు పండుతాయని రైతులు (Farmers) ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. ఈ మూడు రోజులపాటు వర్షాలు అధికంగా ఉండడంతో ప్రాజెక్టు, వాగుల వైపు ఎవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు (DE Venkateshwarlu) ప్రజలను కోరారు. ప్రధాన కాలువ ద్వారా సైతం 120 క్యూసెక్కుల నీటిని పంటల సంరక్షణకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టానికి అడుగు నీటిమట్టం తక్కువ ఉన్నట్లు తెలిపారు. వర్షాలు అధికంగా కురిస్తే ప్రాజెక్టు పొంగిపొర్లే అవకాశం ఉందని అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.