అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | భారీవర్షాలు నిజాంసాగర్ మండలాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి.
ఎన్హెచ్ 765–డీ రోడ్డు (NH-765) విస్తరణ పనులకు భారీ నష్టం వాటిల్లింది. వానల కారణంగా ఈ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. ఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న కల్వర్టులు కుంగిపోయాయి. ఈరోడ్డు విస్తరణ కోసం తెచ్చిన సామగ్రి పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది.
మహమ్మద్ నగర్ (Mahammad Nagar), నిజాంసాగర్ మండలాల్లోని నర్వ, మహమ్మద్ నగర్, బొగ్గుగుడిసె చౌరస్తా (Boggu gudise) ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా వరద బీభత్సం సృష్టించింది. బాన్సువాడ (banswada), ఎల్లారెడ్డి (Yeallreddy) ప్రధాన ప్రధాన రహదారి సైం పూర్తిగా దెబ్బతిన్నది.
బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డు కోతకు గురైంది. నర్వ, మమ్మద్ నగర్ శివారులో కల్వర్టులు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డువిస్తరణ పనులు చేపడుతున్న కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (Keystone Infra Private Limited) సంస్థకు విపత్తు మూలంగా రూ.కోట్లల్లో నష్టం జరిగింది.
కోతకు గురై, కొట్టుకుపోయిన రోడ్లకు సంబంధించి కాంట్రాక్టర్ తాత్కాలిక మరమ్మతు పనులు చేపడుతున్నారు. వరదనీటి ప్రవాహంలో వాటర్ ట్యాంకర్ మునిగిపోవడంతో పాటు ఇనుపరాడ్లు, కల్వర్టుల సామాగ్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
కొట్టుకుపోయిన రోడ్డు
కల్వర్టు వద్ద కుండిపోయిన రోడ్డు