అక్షరటుడే, వెబ్‌డెస్క్: Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం వల్ల విమానంలోని 241 మంది ప్రయాణికులు, విమానం కూలిన ప్రాంతంలోని మరికొంత మంది దుర్మరణం చెందారు.
ఈ దుర్ఘటనకు కారణాలు ఇంత వరకు అంతుచిక్కకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్లైట్ కూలిపోవడానికి సాంకేతిక లోపమా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? లేదంటే మన దేశంపై కుట్రతో శత్రు దేశాలు కానీ, మరెవరైనా సైబర్ దాడి చేసి.. విమానాన్ని కూల్చేశారా..? అనే సందేహాలు ప్రస్తుతం అందరినీ కుదిపేస్తున్నాయి.
ఈ విషయంలో సమాధానాలను భారత్‌పాటు విదేశాలు సైతం తెలుసుకోవాలని అనుకుంటున్నాయి. ఈ మేరకు అమెరికా(America), యూకే(UK) తమ ప్రత్యేక బృందాలను భారత్‌కు పంపుతున్నాయి. టేకాఫ్‌కు ముందే విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా..? లేక విమానం అకస్మాత్తుగా పనిచేయకుండా పోయిందా? విమానం నిర్వహణలోనే నిర్లక్ష్యం జరిగిందా? లేదంటే టేకాఫ్ సమయంలో పైలటే ఏదైనా తప్పు చేశాడా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. సాధారణంగా టేకాఫ్ సమయంలో 65 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే జరుగుతాయని ఒక నివేదిక చెబుతోంది. కాగా, కుట్ర కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ ఇండియా విమానం AI171(Air India flight AI171) జూన్ 12న అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదం బారిన పడింది. వాతావరణం బాగానే ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్నాక సడెన్‌గా కిందికి పడిపోయింది.
ఇలా ఎందుకు జరిగిందనేది ప్రశ్నార్థకం. ఫ్లాప్‌లను తప్పుగా అమర్చారా..? ఇంజిన్‌కు తక్కువగా థ్రస్ట్ పవర్ వచ్చిందా? 3505 మీటర్ల రన్‌వే నుంచి సమయానికి ముందే టేకాఫ్ అయిందా? ల్యాండింగ్ గేర్ సమయానికి పైకి లేవకపోయిందా..? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి.
విమానం 625 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా పడిపోవడం ప్రారంభించింది. టేకాఫ్ సమయంలో దాని వేగం 174 నాట్లుగా పేర్కొంటున్నారు. కానీ, బోయింగ్ 787కు కనీసం 200 నుంచి 250 నాట్ల వేగం అవసరం. ఇక విమానం కూలిపోయిన వీడియోలో దాని ల్యాండింగ్ గేర్ క్రిందికి కనిపిస్తోంది. కానీ, టేకాఫ్ సమయంలో అలా ఉండొద్దు.
విమానంలో టేకాఫ్ అయ్యే సమయంలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందనేది నివేదిక. అంటే అధిక బరువు వల్లనే ఇంజిన్ తగినంత థ్రస్ట్ పొందలేదా అనేది మరో అనుమానం. దర్యాప్తు సంస్థలు విమానం బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు. అయినా, ఇది విమాన ప్రమాదం గురించి పూర్తి నిజాలు వెల్లడిస్తుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.
Plane Crash : సైబర్ దాడి జరిగిందా..?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి(cyber attack) ఏమైనా ఉందా..? అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే సైబర్ దాడి ద్వారా విమానాన్ని కూల్చివేసే అవకాశం ఉన్నట్లు గతంలోని ఘటనలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2025లో మయన్మార్‌లో భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత్ ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించిన సమయంలో, భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి జరిగినట్లుగా ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. కానీ, అప్పుడు పైలట్లు బ్యాకప్ వ్యవస్థతో తమ మిషన్‌ను పూర్తి చేయడం గమనార్హం.
అట్లాంటిక్ విమానాశ్రయం(Atlantic Airport)లో సెప్టెంబరు 19, 2016న బోయింగ్ 757 విమానం(Boeing 757 aircraft) ఆపరేటింగ్ సిస్టమ్(operating system) హ్యాక్(HACK) అయిందన్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనాంశం. తర్వాత US హోంల్యాండ్ డిపార్ట్‌మెంట్(US Department of Homeland) దీనిని రిహార్సల్ అని చెప్పుకొచ్చింది.